పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి
పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం పట్టణంలో జనవరి 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఉమెన్స్ జూనియర్ కళాశాలలో మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి యశ్వంత్ కుమార్, నగర అధ్యక్ష–కార్యదర్శులు హరిచంద్ర ప్రసాద్, సందీప్ సురేష్‌లు మాట్లాడుతూ… 53 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన పిడిఎస్‌యూ 23వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అలేఖ్య, కావ్య, నవ్య, స్పందన తదితరులు పాల్గొన్నారు.


