epaper
Sunday, March 8, 2026
epaper

మేయర్ పీఠమే టార్గెట్

మేయర్ పీఠమే టార్గెట్
క‌రీంన‌గ‌ర్‌లో పొలిటిక‌ల్ పీక్‌
మూడు పార్టీల మ‌ధ్య త్రిముఖ పోటీ ఉండే ఛాన్స్‌
స‌ర్వే మంత్రం జ‌పిస్తున్న మూడు పార్టీలు
గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించేలా వ్యూహాలు
కాంగ్రెస్ పార్టీలో క‌నిపిస్తున్న స‌మ‌న్వ‌య లోపం
జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మ‌ల ముందు మునిసిప‌ల్ ప‌రీక్ష‌
రిజర్వేషన్ల తారుమారుతో మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు
డివిజన్ షిఫ్ట్ గేమ్‌తో ఆశావహుల పరుగులు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ 2026 ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా విడుదలైన 66 డివిజన్ల రిజర్వేషన్ జాబితా రాజకీయ అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. నిన్నటివరకు టికెట్ ఖాయం అనుకున్న నేతల ధీమా చెదిరిపోగా, అన్ని పార్టీల్లోనూ “గెలుపు గుర్రాలకే టికెట్లు” అన్న ఫార్ములా తెరపైకి వచ్చింది. రిజర్వేషన్లతో ముందువరుస నేతలు వెనక్కి నెట్టబడుతుండగా, ఇప్పటివరకు సైడ్‌లైన్‌లో ఉన్న ఆశావహులు అవకాశాల కోసం ముందుకు వస్తున్నారు. సొంత డివిజన్‌లో అడ్డంకులు ఎదురవడంతో కొందరు నేతలు వేరే డివిజన్‌ల నుంచి పోటీకి సిద్ధమవడం ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.

మేయర్ పీఠమే మాస్టర్ కీ

తాజా రిజర్వేషన్ జాబితాతో కరీంనగర్ మేయర్ పదవి బీసీ జనరల్కు కేటాయించబడటం నగర రాజకీయ గేమ్‌ను పూర్తిగా మార్చేసింది. కార్పొరేషన్‌లో ఎన్ని డివిజన్లు గెలిచినా చివరికి మేయర్ పీఠం ఎవరి చేతిలో పడుతుందన్నదే ఇప్పుడు అసలు రాజకీయ లక్ష్యంగా మారింది. దీంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు తమ వ్యూహాలను మేయర్ పీఠం చుట్టూనే కేంద్రీకరించాయి. బీసీ జనరల్‌కు కేటాయించిన డివిజన్లు ఒక్కసారిగా హాట్‌సీట్‌లుగా మారి, ఇక్కడి నుంచే మేయర్ అభ్యర్థి వచ్చే అవకాశాలపై చర్చ జోరందుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తాజా రిజర్వేషన్లతో అంతర్గత సమన్వయ లోపాలు బయటపడుతున్నాయి. నగరంలో వేర్వేరు నేతలు వేర్వేరు దారుల్లో నడుస్తుండటంతో టికెట్ల హామీలు, చేరికలు గందరగోళానికి దారితీస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి *తుమ్మల నాగేశ్వరరావు*ను నియమించడం కీలకంగా మారింది. నగర నేతల మధ్య సమన్వయం సాధించి నిజమైన గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం ఆయన ముందున్న పెద్ద సవాల్‌గా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

గంగుల వ్యాఖ్యలతో వేడెక్కిన వాతావరణం

రిజర్వేషన్లపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు కరీంనగర్ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతను రేపాయి. శాస్త్రీయంగా రిజర్వేషన్లు పూర్తికాకుండా ఎన్నికలు జరపొద్దని, అవసరమైతే వాయిదా వేయాలన్న డిమాండ్ రాజకీయ చర్చకు తెరలేపింది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికలను పునరాగమనానికి కీలక అవకాశంగా మలచుకోవాలనే వ్యూహంతో గెలుపు గుర్రాల వేటపై దృష్టి పెట్టింది. బీజేపీ ఈసారి పూర్తిగా సర్వే ఆధారిత వ్యూహంతో ముందుకెళ్తోంది. డిసిప్లిన్‌, సర్ప్రైజ్‌లతో ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలన్నదే పార్టీ ప్లాన్‌. అభ్యర్థుల ఎంపికలో భావోద్వేగాలకు చోటులేకుండా గెలుపు అవకాశాలే తుది ప్రమాణంగా మారాయి. మొత్తానికి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి సాధారణ రాజకీయ పోటీగా కాకుండా గెలుపు గుర్రాల ఎంపికకు జరిగే కఠిన రాజకీయ వడపోతగా మారాయి. టికెట్ల తుది జాబితా వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం ఎల్లంపల్లి, మిడ్ మానేర్,...

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం..

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత...

పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్...

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ...

హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ :...

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన –...

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img