మైసంపల్లిలో ఉపాధి పనులు ప్రారంభం
కాకతీయ, దుగ్గొండి : గ్రామాభివృద్ధికి ఉపాధి హామీ పనులు కీలకంగా తోడ్పడతాయని, వ్యవసాయానికి అనుసంధానంగా ఈ పనులను సద్వినియోగం చేసుకోవాలని మైసంపల్లి సర్పంచ్ వేముల ఇంద్రదేవ్ అన్నారు. మంగళవారం గ్రామంలో ఉపాధి హామీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి పథకం ద్వారా మరుగుదొడ్లకు నీటికోసం ఇంకుడుగుంతల నిర్మాణం, పొలాల్లో సేధ్యపు కుంటలు, పంట పొలాలకు దారులు, మట్టి తవ్వకాలు, కాలువల చదును వంటి పనులు చేపట్టవచ్చని కూలీలకు అవగాహన కల్పించారు. వ్యవసాయ కూలీలు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆదాయం పెంచుకోవాలని సూచించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామానికి చెందిన *మొకిడే హంసబాయి*కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.19,000 విలువైన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ కవిత, ఉపసర్పంచ్ బొల్లంపెల్లి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


