తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు
కాకతీయ, దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేట గ్రామంలో మంగళవారం తాటి చెట్టు పై నుండి గీతకార్మికుడు నూరు అశోక్ ప్రమాదవశాత్తు జారీ పడగా తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం మంగళవారం రోజు వారిగానే తాడిచెట్టుకు కళ్ళు గీయడానికి తాటి వనానికి వెళ్లి తాటి చెట్టు ఎక్కుతుండగా గీత కార్మికుడు అశోక్ ప్రమాదవశాత్తు జారిపడడంతో బలమైన గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు చికిత్స కోసం వరంగల్ లోని ఎంజిఎంకు తరలించారు. గాయపడిన గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు నాగేల్లి భాస్కర్, గ్రామ సర్పంచి మోడెం శ్రీలత మల్లేశం, మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ లు డిమాండ్ చేశారు.


