epaper
Wednesday, January 21, 2026
epaper

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

ఏ ప్ల‌స్‌ గ్రేడ్​ రద్దు బీ కేటగిరీలోకి రో-కో !

సెంట్రల్ కాంట్రాక్ట్​లో కీలక మార్పుల‌కు ప్లాన్ఏ

ర్యాకింగ్స్‌​ రద్దు చేసేలా ప్రతిపాదనలు

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : ప్లేయర్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్​ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త విధానంలో ‘ఏ+’ గ్రేడ్‌ను పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ మార్పులు అమల్లోకి వస్తే టీమ్​ఇండియా స్టార్​ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ‘బీ’ గ్రేడ్​కు మారే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

మూడు గ్రేడ్లకే పరిమితం చేయాలని ప్రతిపాదన

ప్రస్తుతం ఉన్న సెంట్రల్ కాంట్రాక్ట్ విధానంలో మార్పులు చేయాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. దీని ప్రకారం ఏ ప్ల‌స్ గ్రేడ్ (రూ.7 కోట్లు)ను పూర్తిగా రద్దు చేయాలని సూచించింది. దాని స్థానంలో కేవలం ఏ, బీ,సీ అనే మూడు గ్రేడ్లు మాత్రమే కొనసాగించాలని పేర్కొంది. ఒకవేళ ఈ మార్పులు అమల్లోకి వస్తే ప్రస్తుతం వన్డే ఫార్మాట్​కు మాత్రమే ఆడుతున్న విరాట్, కోహ్లిను బీ గ్రేడ్​లోకి మార్చే అవకాశం ఉంది. అయితే వార్షిక వేతనం విషయంలోనూ ఈ మార్పులు వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై తదుపరి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్స్ అంటే ప్రతి సంవత్సరం భారత క్రికెటర్లకు ఇచ్చే రిటైనర్లు. వీటిని ఏ+,ఏ, బీ, సీ గ్రేడ్​లుగా వర్గీకరిస్తారు. గ్రేడ్​ను బట్టి వార్షిక ఫీజులు ఉంటాయి. A+ గ్రేడ్​కు రూ.7 కోట్లు, A గ్రేడ్​కు రూ.5 కోట్లు B గ్రేడ్​కు రూ.3 కోట్లు, C గ్రేడ్​కు రూ.1 కోటి ఉంటుంది. ఈ మొత్తం మ్యాచ్ ఫీజులతో పాటు అదనంగా ఉంటుంది.

మహిళా క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజులు భారీగా పెంపు

ఇక ఇటీవల మహిళా క్రికెటర్లు, మ్యాచ్‌ అధికారుల ఫీజులను రెట్టింపుకన్నా ఎక్కువగా పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీనికి బోర్డు అపెక్స్‌ కౌన్సిల్‌ అధికారికంగా ఆమోదం తెలిపింది. సీనియర్‌ మహిళల దేశవాళీ వన్డే టోర్నమెంట్‌తో పాటు బహుళ రోజుల టోర్నీల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న ప్లేయర్లకు రోజుకు రూ.50 వేల మ్యాచ్‌ ఫీజు చెల్లించనున్నారు. ఇప్పటివరకు ఈ ఫీజు కేవలం రూ.20 వేలు మాత్రమే ఉండేది. ఇక రిజర్వ్‌ ఆటగాళ్లకు రోజుకు రూ.25 వేలు అందించనున్నారు. అంటే గతంతో పోలిస్తే రెట్టింపుకు పైగా పెరుగుదల నమోదైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌ టీమ్ఇండియాకు 5 చేదు జ్ఞాపకాలు ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న చెత్త రికార్డులు...

బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్‌

బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్‌ ఈనెల 21లోపు తుది నిర్ణయాన్ని తెల‌పాలి లేదంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయ్ ఐసీసీ...

ఆట‌కు వీడ్కోలు ప‌లికిన సైనా నెహ్వాల్

ఆట‌కు వీడ్కోలు ప‌లికిన సైనా నెహ్వాల్ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : భారత...

చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్..

చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్.. 45 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్...

గంభీర్.. నీకో దండం!

గంభీర్.. నీకో దండం! టీమిండియాను వదిలేయ్! భార‌త్ క్రికెట్ కోచ్‌పై ఫ్యాన్స్ ఫైర్ హెడ్ కోచ్...

ఫామ్​లోనే రోహిత్

ఫామ్​లోనే రోహిత్ ఒక్క సిరీస్ ప్రదర్శన ఆధారంగా విమ‌ర్శించ‌డం త‌గ‌దు హిట్​మ్యాన్​కు ​గిల్ మద్దతు కాక‌తీయ‌,...

ఫీల్డింగే ముంచింది

ఫీల్డింగే ముంచింది మిడిల్ ఓవర్లలో ఫీల్డర్ల ఉదాసీనత చాలా తేలికగా సింగిల్స్ ఇచ్చేశారు బౌలర్లు సృష్టించిన...

తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి‌పై వేటు

తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి‌పై వేటు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టు కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img