హన్మకొండ బస్టాండ్‌ను ఆధునీకరించండి
రవాణాశాఖ మంత్రికి కుడా చైర్మన్, డీసీసీ అధ్యక్షుడి వినతిపత్రం
కాకతీయ, హన్మకొండ : హన్మకొండ బస్టాండ్‌ను ఆధునీకరించాలని కోరుతూ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచన మేరకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. హన్మకొండ బస్టాండ్‌లో మౌలిక సదుపాయాల లోపం ఉందని, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో బస్టాండ్‌ను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని, దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.


