జనసేన జూలూరుపాడు మండల అధ్యక్షుడిగా ఉసికేల రమేష్
కాకతీయ, జూలూరుపాడు : జూలూరుపాడు మండలానికి నూతనంగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా అనంతారం గ్రామానికి చెందిన *ఉసికేల రమేష్*ను నియమించారు. ఈ నియామకంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, హైదరాబాద్ కూకట్‌పల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో తనను మండల అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. మండలంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. యువకుడిని మండల అధ్యక్షుడిగా ఎంపిక చేయడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నియామకం ద్వారా మండలంలో పార్టీ కార్యకలాపాలు మరింత చురుకుగా సాగుతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.


