జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి చేయూత
కాకతీయ, నెల్లికుదురు : ఇటీవల మృతి చెందిన శ్రీరామగిరి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు మద్దెల శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని నెల్లికుదురు మండల జర్నలిస్టులు మంగళవారం పరామర్శించారు. శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు. సహచర రిపోర్టర్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన సేవలను స్మరించారు. అనంతరం మండల జర్నలిస్టులు కలిసి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని శ్రీనివాస్ కుమారుడు *జీవన్*కు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు అశోక్, పంజాల వాసుదేవ గౌడ్, మల్యాల నరసయ్య, బొలగాని యాకయ్య గౌడ్, గొల్లపల్లి విజయ్ బాబు, మద్ది వెంకటేశ్వర్లు, హెచ్చు మహేందర్, బైరు శ్రీనివాస్, మస్కపురి కుమార్, పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్, మస్కపురి సుధాకర్, పోరండ్ల లక్ష్మయ్య, సింగరం ప్రసాద్, సిరబోయిన జగన్ యాదవ్, చెదలయకాంతం, గుగులోతు నగేష్, పెరుమాడ్ల రమేష్, జిలకర శ్రీధర్ పాల్గొన్నారు


