epaper
Sunday, March 8, 2026
epaper

పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం సన్నాహాలు
క్రిటికల్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత
వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు తప్పనిసరి
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని
వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

కాకతీయ, కరీంనగర్ : పురపాలక ఎన్నికల నిర్వహణకు జిల్లాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

త్వరలో ఎన్నికల షెడ్యూల్..
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా సిబ్బందిని నియమించాలని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం బయట సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక విఘాతం కలిగించే వ్యక్తులపై బైండోవర్ చర్యలు చేపట్టాలని సూచించారు.

డ్రోన్లతో పర్యవేక్షణ.. సిబ్బందికి శిక్షణ ఏర్పాట్లు

ఎన్నికల ప్రచారం పర్యవేక్షణకు, పోలింగ్–కౌంటింగ్ కేంద్రాల్లో సాధ్యమైన మేర డ్రోన్ల వినియోగం చేయాలని తెలిపారు. ఎన్నికల విధులకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లు జిల్లాలకు చేరుకుంటారని, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతుల వివరాలను టి–పోల్‌లో నమోదు చేసినట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు తదితర ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్, బయట సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం ఎల్లంపల్లి, మిడ్ మానేర్,...

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం..

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత...

పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్...

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ...

హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ :...

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన –...

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img