epaper
Sunday, March 8, 2026
epaper

కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం

కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం
కరీంనగర్‌ను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్‌కే ప్ర‌జ‌లు ప‌ట్టం
అభ్యర్థులు దొరకని పార్టీలే విమర్శలు చేస్తున్నాయి
బీఆర్ఎస్ క‌రీంన‌గ‌ర్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధే నినాదంగా ప్రజల్లోకి వెళ్తామని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకక రెండు పార్టీల నేతలు అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గెలిచే సత్తా ఉన్న నాయకులు లేక బీఆర్ఎస్ కార్యకర్తలకు కండువాలు కప్పి తమ పార్టీల్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డివిజన్ల వెంట కండువాలు పట్టుకుని తిరిగినా ప్రజల నుంచి ఆదరణ లభించడం లేదన్నారు.

కండువా మార్చగానే గతం మర్చిపోయారా?

మాజీ మేయర్ సునీల్ రావుపై తీవ్ర విమర్శలు చేసిన హరిశంకర్.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు బీజేపీ చేసిందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. కండువా మార్చగానే గతాన్ని మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. రెండేళ్లుగా నగరానికి నిధులు తీసుకురాని కాంగ్రెస్ నేతలు ఎన్నికల వేళ కొబ్బరికాయలు కొడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నగరానికి చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

గంగుల–వినోద్ కృషితోనే నగర సుందరీకరణ

మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కృషితోనే కరీంనగర్ నగరం సుందరంగా మారిందని హరిశంకర్ గుర్తుచేశారు. డంప్‌యార్డు తరలింపు వంటి ప్రధాన సమస్యలపై ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలను కూడా ఎత్తిచూపుతూ, కరీంనగర్ ప్రజలు విజ్ఞులని, అభివృద్ధికి పట్టం కడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, కచ్చు రవి, నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు షౌకత్, యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బొంకూరి మోహన్, ఆరె రవి గౌడ్, తొంటి రాజేందర్, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, జల్లోజి శ్రీనివాస్, సతినేని శ్రీనివాస్, నాగుల కిరణ్ కుమార్ గౌడ్, పూరెల్ల సరోజ, ఒడ్నాల రాజు, సుంకిశాల సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం ఎల్లంపల్లి, మిడ్ మానేర్,...

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం..

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత...

పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్...

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ...

హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ :...

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన –...

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img