ప్రజల గుండెల్లో నిలిచే పనులే లక్ష్యం
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
శాషామహల్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రారంభం
కాకతీయ, కరీంనగర్ : నగరంలోని పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. రేకుర్తి 20వ డివిజన్‌లో రూ.10 లక్షల వ్యయంతో యూజీడీ పైప్‌లైన్, రోడ్డు ఫార్మేషన్ పనులను ప్రారంభించారు. అలాగే శాషామహల్ 37వ డివిజన్‌లో మరో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినా అవి బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదని విమర్శించారు. అభివృద్ధి జరుగుతున్నా లేదని చెప్పడం కళ్లున్న కబోదిలా మాట్లాడటమేనని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా ముందుకు సాగుతామని సుడా చైర్మన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ తాజ్, లయక్ ఖాద్రి, అబ్దుల్ రహమాన్, నిహాల్ అహ్మద్, అస్తపురం రమేష్, అస్తపురం తిరుమల, వెన్నం రజితా రెడ్డి, పర్వతం మల్లేశం, జక్కుల మల్లేశం, గంగిపెల్లి సంపత్, ఆవూరి లత, కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


