నర్సంపేట బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్‌గా రవీందర్ రావు
కేటీఆర్ ఆదేశాలతో నియామకం..పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటన
కాకతీయ, నర్సంపేట : బీఆర్‌ఎస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా తక్కల్లపల్లి రవీందర్ రావును రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో నియమించినట్లు మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నియామకం అనంతరం రవీందర్ రావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి, ఈ బాధ్యత అప్పగించడంలో సహకరించిన పెద్ది సుదర్శన్ రెడ్డికి, నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.



