epaper
Monday, January 19, 2026
epaper

కాంగ్రెస్ బీ–ఫామ్‌లపై ఎమ్మెల్యే పెత్తనం చేయొద్దు

కాంగ్రెస్ బీ–ఫామ్‌లపై ఎమ్మెల్యే పెత్తనం చేయొద్దు
పార్టీ వ్యవహారాల్లో జోక్యాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించం
క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలి
ప‌దేళ్లుగా ప‌నిచేసిన వారిని విస్మ‌రించొద్దు
ఎమ్మెల్యే సంజ‌య్‌ ఏపార్టీలో ఉన్నాడో ఆయ‌న‌కే తెల్వ‌దు
మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్‌

కాకతీయ, జగిత్యాల : కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. సోమవారం జ‌గిత్యాల‌లో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ, అసలు ఏ పార్టీలో ఉన్నాడో కూడా స్పష్టత లేని ఎమ్మెల్యే రాజ్యాంగం, నైతిక విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బీ–ఫామ్‌లు ఇవ్వడం ఎమ్మెల్యే పని కాదని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి, పార్టీ టికెట్లపై పెత్తనం చెలాయించాలనుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్యేగా ప్రజాపాలనకు, సంక్షేమ పథకాలకు మద్దతిస్తే స్వాగతిస్తామని, కానీ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు.

పార్టీని నడిపించేది కార్యకర్తలే
పార్టీని నడిపించేది కార్యకర్తలేనని, టికెట్లు కూడా పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలకే ఇవ్వాలన్నదే తన స్పష్టమైన డిమాండ్ అని జీవన్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం రక్తం చిందించిన వారిని పక్కన పెట్టి బయటి జోక్యాలను అనుమతించబోమని కఠిన స్వరంతో హెచ్చరించారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడం సహజ ప్రక్రియేనని జీవన్ రెడ్డి అన్నారు. తాను కూడా గతంలో ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై అప్పటి ముఖ్యమంత్రిని కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేస్తూ, ఎమ్మెల్యే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. గౌరీ శంకర్ ఇన్ఫ్రా నిర్మాణ సంస్థకు సింగిల్ టెండర్ ద్వారా పనులు అప్పగించడంలో ఉన్న అంతర్యం ఏమిటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రెండేళ్లు గడుస్తున్నా సమీకృత మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి రాకుండా గోదాంగా మార్చేశారని మండిపడ్డారు. ఇదేనా అభివృద్ధి అని ఎమ్మెల్యేను నిలదీశారు. యావర్ రోడ్డు విస్తరణ పనులకు అడ్డుపడుతున్నది కూడా ఎమ్మెల్యేనేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తల హక్కులను కాపాడటం తన బాధ్యత అని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి, పార్టీ వ్యవహారాల్లో అనవసర జోక్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మరోసారి తేల్చిచెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పంథా మార్చిన ఇసుక మాఫియా

పంథా మార్చిన ఇసుక మాఫియా సంచుల్లో నింపి రవాణా.. పోలీసుల నిఘాకు చిక్కిన...

క్యాత‌న్‌ప‌ల్లి హస్తం పార్టీలో టికెట్ల కుంపటి

క్యాత‌న్‌ప‌ల్లి హస్తం పార్టీలో టికెట్ల కుంపటి టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మంత్రి ఎదుటే వాగ్వాదం జెండా...

మహిళల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల...

గద్దెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి

గద్దెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి భక్తులకు ఇబ్బందుల్లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలి సమ్మక్క–సారలమ్మ జాతర...

హుజురాబాద్‌లో బీజేపీ శక్తి చాటాలి

హుజురాబాద్‌లో బీజేపీ శక్తి చాటాలి మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు...

సీనియ‌ర్ల‌కే టికెట్లివ్వాలి

సీనియ‌ర్ల‌కే టికెట్లివ్వాలి ముస్లిం మెజారిటీ డివిజన్లలో ప్రాధాన్యం ఇవ్వాలి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ నేతల...

కనీస వేతనాలకు పూర్తి రక్షణ

కనీస వేతనాలకు పూర్తి రక్షణ వీబీ జీ రామ్ జీ చట్టంతో ఉపాధికి...

కార్పొరేషన్ ఎన్నికల్లో

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించండి కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం వెలిచాల రాజేందర్‌రావు 48వ డివిజన్‌లో బస్తీబాట యువతకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img