చిరంజీవి 158 సినిమాలో యంగ్ హీరో!
కాకతీయ, సినిమా డెస్క్ : మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నారు అగ్ర కథనాయకుడు చిరంజీవి. సంక్రాంతి బరిలో ఫుల్ కాంపిటీషన్లో వచ్చినప్పటికి ఈ సినిమా భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 2026లో బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్ను అందుకున్న మొదటి సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు 158వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాపై ఓ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రంలో గెస్ట్ రోల్ ఉంచేలా ప్లాన్ చేస్తున్నారట బాబి. అంతేకాదు ఆ స్పెషల్ రోల్లో ఓ యంగ్ హీరో నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో ఆ యువ హీరో సన్నివేశాలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఏదేమైనప్పటికి ఆ పాత్రలో ఏ హీరో నటించనున్నరనేది సస్పెన్స్‌గానే ఉంది. దీనిపై త్వరలోనే అన్ని విషయాలు అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.


