నవీన్ పొలిశెట్టి @ రూ.100 కోట్లు
కాకతీయ, సినిమా డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అరుదైన ఘనత సాధించారు. తన లేటెస్ట్ సినిమా ‘అనగనగా ఒక రాజు’తో రూ.100 కోట్ల క్లబ్లో చేరారు. ఆయన హీరోగా డైరెక్టర్ మారి తెరకెక్కించిన ఈ సినిమా 14న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. ఫలితంగా ఐదు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.100 కోట్ల (గ్రాస్) మార్క్ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా నవీన్ తన కెరీర్లో నాలుగో సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. ఆయన ఇప్పటిదాకా ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలతో అలరించారు. నాలుగో సినిమాగా ‘అనగనగా ఒక రాజు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మరో హిట్‌ను ఖాతాలో వేసుకోవడమే కాకుండా, ఈ రేర్ ఫీట్ సాధించారు


