కబరస్తాన్లను శుభ్రం చేయాలి
రంజాన్‌కు ముందే చర్యలు చేపట్టాలి
దహన సంస్కారాలకూ వీలుకాని పరిస్థితి : ఆవాజ్
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలో ఉన్న కబరస్తాన్లను వెంటనే శుభ్రం చేయాలని ఆవాజ్ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ బాబు, ఎం.ఏ. జబ్బార్ మాట్లాడుతూ, నగరంలోని కబరస్తాన్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై పిచ్చి చెట్లు, చెత్తతో నిండిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం వన్ టౌన్ ఆవాజ్ మండల అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ, కబరస్తాన్లలో దాన సంస్కారాలు చేయడానికి కూడా వీలు లేకుండా పరిస్థితి ఉందన్నారు. ప్రతి శుక్రవారం నమాజ్ అనంతరం కబరస్తాన్ సందర్శన చేయడం ఆనవాయితీగా ఉందని, రంజాన్ నెల ఉపవాసాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుందన్నారు. వెంటనే మున్సిపాలిటీ, శానిటేషన్, డీఆర్‌ఎస్, గార్డెన్ సిబ్బందితో శుభ్రత చర్యలు చేపట్టాలని కోరారు. ఈ వినతిపై మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య సానుకూలంగా స్పందించి, శానిటేషన్ సూపర్వైజర్ సాంబయ్యకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ నాయకులు షేక్ బేగం, కార్యదర్శి షేక్ సత్తార్, 41వ డివిజన్ అధ్యక్షుడు షేక్ పాషా, షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.


