ప్రజా గొంతుకగా కాకతీయ పత్రిక : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
కాకతీయ, తొర్రూరు : ఉత్తరం కాకతీయ దినపత్రిక ప్రజా సమస్యలను వెలికితీయడంలో ముఖ్య భూమిక పోషిస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. బాధిత, పేద ప్రజల గొంతుకగా ఉంటూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటోందని అన్నారు. స్థాపించిన కొద్దికాలంలోనే లక్షలాది మంది పాఠకుల ఆదరణను సంపాదించుకోవడం గొప్ప విషయమన్నారు. సోమవారం తొర్రూరులోని బీఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను తొర్రూరు విలేకరి అంకం సురేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కాకతీయ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. తొర్రూరులోని బీఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక విలేకరులు హాజరయ్యారు. కార్యక్రమంలో విలేకరులు ఆండం కృష్ణ, కెలిశెట్టి శంకర్, రామకృష్ణ, పంతం సురేందర్, దుసు రోజు వీరాంజనేయులు, వేర్పుల మహేష్, గట్టు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


