ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కాకతీయ, మరిపెడ : మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ఎల్లంపేట పాఠశాల 1992–93 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సోమవారం మేడారంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 32 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడంతో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఆనందంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా ఎన్నికైన గండి రాధమ్మతో పాటు సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన జరుపుల కాలునాయక్‌ను సన్మానించారు. అలాగే విద్య, వైద్యం, సాఫ్ట్‌వేర్, ఆరోగ్యం, పత్రికారంగం, బ్యాంకింగ్ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న సహపాఠులను ఘనంగా అభినందించారు. వరవీరా ఫౌండేషన్ చైర్మన్ మక్కా అంజన్‌గౌడ్ సహా పలువురు మాట్లాడుతూ బాల్య తండా–ఎల్లంపేట గ్రామపంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.


