epaper
Sunday, March 8, 2026
epaper

భూపాలపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

భూపాలపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
అటవీ భూముల‌ రక్షణకు రూ.3 కోట్లతో గోడ నిర్మాణం
మహిళా సంఘాలకు రూ.కోటి బ్యాంకు లింకేజీ
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌
రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు, రూ.664 కోట్లతో భూపాలపల్లి–గూడెప్పాడు రహదారి
ఎమ్మెల్యే గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు

భూపాలపల్లి, కాకతీయ : భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 5, 6, 7, 26వ వార్డుల్లో చేపట్టనున్న అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులు, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అడవి జంతువులు నివాస ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో రూ.3 కోట్ల వ్యయంతో పటిష్టమైన అటవీ రక్షణ గోడ నిర్మిస్తున్నామని తెలిపారు. మహిళల పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని, అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. సంక్రాంతి సారెగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టామని, మున్సిపల్ పరిధిలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందిస్తామని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, అర్హులైన వారందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో మహిళలకు సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు ఇస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రం వెనుకబాటుకు గురై ఉద్యోగాలు రాలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రూప్–1, 2, 3 ఉద్యోగాలతో పాటు ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అన్ని వేళల్లో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

అభివృద్ధికి రూ.60 కోట్ల నిధులు..

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ అడవులు చుట్టూ ఉండటంతో ప్రజలు ఎన్నో ఏళ్లుగా జంతువుల బెడదను ఎదుర్కొన్నారని, రక్షణ గోడతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. లక్ష జనాభా ఉన్న భూపాలపల్లిలో 30 వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసిందన్నారు. అదే విధంగా రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు, రూ.664 కోట్లతో భూపాలపల్లి–గూడెప్పాడు నాలుగు వరుసల రహదారి, ఆసుపత్రి అభివృద్ధి, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, పారిశ్రామిక పార్క్, పట్టణ పార్కుల అభివృద్ధి వంటి అనేక పనులు చేపడుతున్నామని తెలిపారు. తన హయాంలో అభివృద్ధి జరగకపోతే రానున్న ఎన్నికల్లో ఓట్లు అడగనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, కోటి రూపాయల బ్యాంకు లింకేజీ, రూ.20 లక్షల వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మెప్మా పీడీ రాజేశ్వరి, ఎంపీడీఓ తరుణ్ ప్రసాద్, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..!

బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..! అంత‌లోనే అధిష్ఠానం పెద్ద‌ల నుంచి ఫోన్లు కొమ్మాల జాతరకు ర్యాలీగా...

వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు

వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకానికి ప‌రిపాలనా అనుమతి జీడ‌బ్ల్యూఎంసీ...

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం మంత్రి కొండా సురేఖ ​శివ నగర్‌లో కుట్టు మిషన్ల పంపిణీ 35వ...

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి కాకతీయ, చెన్నారావుపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ...

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం కాకతీయ, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ...

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన కాకతీయ, ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీవివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో...

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!?

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!? కొమ్మాల దేవస్థానంలో మహిళా ఉద్యోగి వింత పోకడలు డ్రెస్...

పట్టణాభివృద్ధే లక్ష్యం

పట్టణాభివృద్ధే లక్ష్యం చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ కాకతీయ, నర్సంపేట టౌన్: పట్టణాన్ని అన్ని రంగాల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img