మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్!
ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ అవకాశం
జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకూ ఆన్‌లైన్ దరఖాస్తులు
కాకతీయ, మరిపెడ: తెలంగాణ మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అక్తర్ పాషా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్షను 2026 ఏప్రిల్ 19న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆరో తరగతిలో 100 సీట్లు అందుబాటులో ఉండగా, ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. దరఖాస్తు రుసుము ఓసీ అభ్యర్థులకు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఢీ అభ్యర్థులకు రూ.125గా నిర్ణయించారు. దరఖాస్తు కోసం TGMS Telangana Gov In వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాలకు మరిపెడ మోడల్ స్కూల్‌ను పని దినాల్లో సంప్రదించాలని కోరారు.


