వేగవంతమైన వార్తలకు కేరాఫ్‌గా కాకతీయ
గీసుగొండ తహసిల్దార్ ఎండి. రియాజుద్దీన్, సీఐ విశ్వేశ్వర్
నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ
బాధ్యతాయుత జర్నలిజంతో ముందుకు సాగాలని పిలుపు
కాకతీయ, గీసుగొండ: నిర్దిష్టమైన, వేగవంతమైన వార్తలను ప్రజలకు చేరవేయడంలో కాకతీయ దినపత్రిక కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని గీసుగొండ తహసిల్దార్ ఎండి. రియాజుద్దీన్, సీఐ విశ్వేశ్వర్ అన్నారు. మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎండి. రియాజుద్దీన్, పోలీస్ స్టేషన్‌లో సీఐ విశ్వేశ్వర్ వేర్వేరుగా కాకతీయ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎప్పటి వార్తలను అప్పుడే ప్రజలకు అందిస్తూ వాస్తవాలకు ప్రాధాన్యం ఇచ్చే దినపత్రికగా కాకతీయ అనతి కాలంలోనే ప్రజల మన్నన పొందిందని ప్రశంసించారు. ప్రాంతీయ సమస్యలు, ప్రజాప్రయోజన అంశాలను ప్రధానంగా తీసుకుని కథనాలు ప్రచురించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా బాధ్యతాయుత జర్నలిజంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రవీందర్, ఏఎస్ఓ ఉదయశ్రీ, ఎస్సై కుమార్, ఏఎస్ఐలు సుదర్శన్, శ్రీనివాస్, రిపోర్టర్ రంపీస మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.



