epaper
Monday, January 19, 2026
epaper

కార్పొరేషన్ ఎన్నికల్లో

కార్పొరేషన్ ఎన్నికల్లో

కాంగ్రెస్‌ను ఆదరించండి

కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

వెలిచాల రాజేందర్‌రావు

48వ డివిజన్‌లో బస్తీబాట

యువతకు టికెట్లపై కీల‌క వ్యాఖ్యలు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అప్పుడే కరీంనగర్ నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లగలమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని తండ్రి మాజీ ఎమ్మెల్యే జగపతిరావు ఆశయాల బాటలో పయనిస్తున్నానని తెలిపారు. ఆదివారం మాజీ కార్పొరేటర్ మీసా రమాదేవి ఆధ్వర్యంలో 48వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రాజేందర్‌రావు ప్రారంభించారు. అనంతరం డివిజన్ అంతటా బస్తీబాట నిర్వహించి ఇంటింటా ప్రచారం చేపట్టారు. మహిళల మంగళహారతులు, ఒగ్గుడోలు కళాకారుల డప్పుచప్పుళ్ల మధ్య కాంగ్రెస్ నాయకులకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. గ‌తంలో కరీంనగర్లో పలువురు బీఆర్ఎస్ నేతల అరెస్టులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేయడం వృథా అని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నగర సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీరు, ఇండ్ల పట్టాలు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌కే అవకాశం ఇవ్వాలని కోరారు.

యువతకు టికెట్లలో ప్రాధాన్యం

కొత్తపెల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో 46వ డివిజన్‌కు చెందిన సుమారు 200 మంది ప్రజలు, గంగపుత్ర సంఘం నాయకులు రాజేందర్‌రావును కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో యువతకు టికెట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే యువత రాజకీయాల్లో ముందుకు రావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని కరీంనగర్ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాజేందర్‌రావు స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీనియ‌ర్ల‌కే టికెట్లివ్వాలి

సీనియ‌ర్ల‌కే టికెట్లివ్వాలి ముస్లిం మెజారిటీ డివిజన్లలో ప్రాధాన్యం ఇవ్వాలి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ నేతల...

కనీస వేతనాలకు పూర్తి రక్షణ

కనీస వేతనాలకు పూర్తి రక్షణ వీబీ జీ రామ్ జీ చట్టంతో ఉపాధికి...

ఆరేళ్ల అభివృద్ధి కనిపించడం లేదా?

ఆరేళ్ల అభివృద్ధి కనిపించడం లేదా? సుమారు రూ.1000 కోట్లతో ప‌నులు ఇతర ప్రాజెక్టులకు మరో...

మా భూములు మాకేన‌ని..

మా భూములు మాకేన‌ని.. 22/ఏ నిషేధానికి వ్యతిరేకంగా భూబాధితుల ఆందోళ‌న‌ శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలో...

పార్టీ మార‌ట్లేదు

పార్టీ మార‌ట్లేదు బీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతా ఎప్పటికైనా ఎమ్మెల్యే గంగుల వెంటే.. కాంగ్రెస్‌లో చేరిక పూర్తిగా అవాస్త‌వం మాజీ...

బీఆర్ఎస్‌లోకి ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర

బీఆర్ఎస్‌లోకి ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర 42వ డివిజన్‌లో పార్టీకి బలం గులాబీ కండువా...

అవినీతి కవలలుగా బీజేపీ–బీఆర్ఎస్

అవినీతి కవలలుగా బీజేపీ–బీఆర్ఎస్ కరీంనగర్‌ను అవినీతి అడ్డాగా మార్చారు రహస్య పొత్తుతో ప్రజలను మోసం...

మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్ల ఖ‌రారు

మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్ల ఖ‌రారు కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img