epaper
Saturday, March 7, 2026
epaper

ఆరేళ్ల అభివృద్ధి కనిపించడం లేదా?

ఆరేళ్ల అభివృద్ధి కనిపించడం లేదా?

సుమారు రూ.1000 కోట్లతో ప‌నులు

ఇతర ప్రాజెక్టులకు మరో రూ.200 కోట్లు..

బీజేపీ నేత, మాజీ మేయర్ సునీల్‌రావు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ నగరంలో గత ఆరు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించకపోవడం ఆశ్చర్యకరమని బీజేపీ నేత, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగరంలో నిర్మించిన రహదారులు, వీధిదీపాలు, పార్కులు, వాకింగ్ ట్రాకులు, ఓపెన్ జిమ్‌లు, హైలాండ్ జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, నిఘా కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా వంటి సదుపాయాలు కూడా కాంగ్రెస్ నాయకులకు కనబడటంలేదని విమర్శించారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన పనులన్నింటినీ విస్మరిస్తూ రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ఆరు సంవత్సరాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి సుమారు రూ.1000 కోట్ల నిధులు తీసుకొచ్చామని, రైల్వే ఓవర్ బ్రిడ్జి సహా ఇతర ప్రాజెక్టులకు మరో రూ.200 కోట్లు సమీకరించినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా నగరాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ అభివృద్ధి పేరుతో ఓట్లు అడుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రజలు అభివృద్ధి చేసిన పార్టీకే మద్దతు ఇస్తారని సునీల్‌రావు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం ఎల్లంపల్లి, మిడ్ మానేర్,...

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం..

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత...

పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్...

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ...

హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ :...

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన –...

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img