గోశాలలకు దాణా పంపిణీ
చొల్లంగి అమావాస్య సందర్భంగా స్థంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
కాకతీయ, ఖమ్మం : పుష్యమాస చొల్లంగి అమావాస్యను పురస్కరించుకుని శ్రీ స్థంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ గోశాలలకు గోదాణా వితరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నగర పెద్దలు, వ్యాపారులు, దాతల సహకారంతో సేకరించిన సుమారు రూ.69 వేల విరాళాలతో గొల్లగూడెం ఓం శ్రీకృష్ణ గోశాలకు రూ.46 వేలు, టేకులపల్లి శ్రీ వెంకటేశ్వర గోశాలకు రూ.13 వేలు అందించారు. అలాగే శ్రీ లక్ష్మి రంగనాధ స్వామి గోశాలకు రూ.8 వేల విలువైన ట్రాక్టర్ వరిగడ్డి, శ్రీ గుంటిమల్లేశ్వర స్వామి గోశాల, శ్రీ శృంగేరి శారద పీఠం గోశాలలకు రూ.2 వేల విలువైన బెల్లం, తవుడు, పప్పుధాన్యాలు, పచ్చిగడ్డి తదితర గోదాణా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కన్వీనర్ తూములూరి లక్ష్మీ నరసింహారావు, సభ్యులు, గోభక్తులు పాల్గొన్నారు. దాతలకు గోశాల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు


