epaper
Sunday, January 18, 2026
epaper

కదం తొక్కిన కామ్రేడ్స్… ఎర్రబారిన ఖమ్మం!

కదం తొక్కిన కామ్రేడ్స్… ఎర్రబారిన ఖమ్మం!
ఎటు చూసినా అరుణ పతాకాల రెపరెపలే
కిలోమీటర్ల కొద్ది నడిచొచ్చిన కామ్రేడ్స్‌
ఖ‌మ్మం ప్ర‌ధాన వీధుల్లో జనసేవాదళ్ కవాత్
వేల మందిని ఆకట్టుకున్న కళారూపాలు
సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు చారిత్రక ముగింపు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ సందర్భంగా ఖమ్మం నగరం ఎర్రబారింది. కామ్రేడ్స్ కదం తొక్కగా… అరుణ పతాకాలు ఆకాశాన్నే తాకాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో ఖమ్మం పురవీధులు కిటకిటలాడాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఎర్రజెండా… ఎర్రని వస్త్రధారణతో నగరమంతా కమ్యూనిస్టు ఉద్యమ ఉత్సాహంతో మార్మోగింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు ఖమ్మానికి చేరుకున్నారు. నాగపూర్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ వంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు సభకు హాజరయ్యారు. ప్రధాన రహదారులన్నీ కార్యకర్తల రాకతో దిగ్బంధితమయ్యాయి. ఎటు చూసినా అరుణ పతాకాల రెపరెపలే కనిపించాయి.

కిలోమీటర్ల కొద్ది నడిచిన కామ్రేడ్స్

భారీగా తరలివచ్చిన జనంతో ట్రాఫిక్ జామ్ కావడంతో, పలువురు కార్యకర్తలు కిలోమీటర్ల కొద్ది నడిచి ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకున్నారు. వందలాది వాహనాలు నగరంలోకి రావడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అయినా, అలసటను లెక్కచేయకుండా శ్రేణులు ముందుకు సాగాయి. ఈ సభలో యువత భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషంగా మారింది. జనసేవాదళ్ కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు, యువతులు తరలివచ్చారు. క్రమశిక్షణతో మూడు కిలోమీటర్ల మేర నడిచి సభా స్థలికి చేరుకున్న యువత… నాయకుల ఉపన్యాసాలకు, ప్రజానాట్యమండలి పాటలకు అలసిపోకుండా కేరింతలు కొట్టింది. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన “ఎర్రజెండా… ఎర్రజెండా” పాటకు సభా ప్రాంగణం మొత్తం ఊగిపోయింది. పూనకం వచ్చినట్లుగా వేలాది మంది అరుణ పతాకాలను ఊపుతూ ఒక సరికొత్త విప్లవ వాతావరణాన్ని సృష్టించారు. యువత ఉత్సాహాన్ని చూసి ముఖ్యమంత్రి కూడా ఒక్కింత ఆశ్చర్యపోయినట్టు సభావర్గాలు పేర్కొన్నాయి.

మూడు ప్రదర్శనలు… వేలాది జనం

ముగింపు సభ సందర్భంగా ఖమ్మంలో మూడు భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
మొదటి ప్రదర్శన పెవిలియన్ మైదానం నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనసేవాదళ్ కార్యకర్తలు వరుసకు నలుగురు చొప్పున క్రమశిక్షణతో కదం తొక్కారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగిన ఈ కవాతును నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా యువ మహిళల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదేళ్ల లోపు చిన్నారులు కూడా లెఫ్ట్… రైట్… అంటూ కదం తొక్కుతూ భవిష్యత్తు తరమే మాదన్న సందేశాన్ని చాటి చెప్పారు. ఈ ప్రదర్శనకు సీపీఐ అగ్ర నేతలు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం, బాగం హేమంతరావు తదితరులు నేతృత్వం వహించారు. జనసేవాదళ్ తర్వాత సింగరేణి కార్మికులు, యువ మహిళలు, పర్ష పద్మ నేతృత్వంలో నాగళ్లు చేతబూనిన రైతులు, కోయ–లంబాడ జానపద నృత్య కళాకారులు, వందలాది మంది డప్పు కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. బతుకమ్మలతో మహిళలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యాయవాదులు, వైద్యులు, యువజన, విద్యార్థి సంఘాల కార్యకర్తలు కూడా ఈ కవాతులో భాగమయ్యారు. ఇటీవల ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో ఈ ప్రదర్శన సాగిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

మూడు దారులు… ఒకే లక్ష్యం

రెండో ప్రదర్శన నయాబజార్ కళాశాల నుంచి ప్రారంభమై మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్ మీదుగా సభా స్థలికి చేరుకుంది. దీనికి రాష్ట్ర సహాయ కార్యదర్శి తకెళ్లపల్లి శ్రీనివాసరావు, బోస్, కె. శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ నేతృత్వం వహించారు. మూడో ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమై రోటరీ నగర్, మమత రోడ్డు, ఇల్లందు క్రాస్ రోడ్ మీదుగా సభా స్థలికి చేరుకుంది. ఈ ప్రదర్శనకు జాతీయ సమితి సభ్యులు ఎస్‌కే సాబీర్‌పాషా, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు నాయకత్వం వహించారు. మొత్తంగా…ఎర్రజెండాల మధ్య ఖమ్మం నగరం చరిత్రాత్మక దృశ్యానికి వేదికగా నిలిచింది. వందేళ్ల ఉద్యమానికి తగ్గట్టే… మరో వందేళ్ల పోరాటానికి సిద్ధమన్న సంకేతాన్ని ఈ శతాబ్ది ముగింపు సభ గట్టిగా వినిపించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్య హక్కును ఖ‌చ్చితంగా అమ‌లు చేయాలి

విద్య హక్కును ఖ‌చ్చితంగా అమ‌లు చేయాలి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రితో కాగితాల‌కే...

సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రికార్డు

సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రికార్డు మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి! సాగునీటి–విద్య–వైద్య రంగాల్లో...

గోశాలలకు దాణా పంపిణీ

గోశాలలకు దాణా పంపిణీ చొల్లంగి అమావాస్య సంద‌ర్భంగా స్థంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో...

ముగ్గుల పోటీల బహుమతుల ప్రదానోత్సవం

ముగ్గుల పోటీల బహుమతుల ప్రదానోత్సవం 39వ డివిజన్‌లో ఇమామ్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు మహిళల...

లలితకు నివాళి అర్పించిన కాంగ్రెస్ నేత‌లు

లలితకు నివాళి అర్పించిన కాంగ్రెస్ నేత‌లు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా...

ఖబర్దార్ రాధాకృష్ణ! భట్టి పై వ్యాఖ్యలు మానుకోండి

ఖబర్దార్ రాధాకృష్ణ! భట్టి పై వ్యాఖ్యలు మానుకోండి భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఓబీసీ సెల్...

ఎన్టీఆర్‌కు బీఆర్ఎస్ నేతల ఘన నివాళి

ఎన్టీఆర్‌కు బీఆర్ఎస్ నేతల ఘన నివాళి కాకతీయ, జూలూరుపాడు : నందమూరి తారక...

ఎర్రజెండా పోరాటాలకు వందనం!

ఎర్రజెండా పోరాటాలకు వందనం! పేదల కోసం ప్రాణాల‌ర్పించిన కమ్యూనిస్టులు దున్నేవాడిదే భూమి సిద్ధాంతానికి చారిత్రక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img