epaper
Friday, March 6, 2026
epaper

తొర్రూరుపై గులాబీ జెండా ఎగురవేస్తాం!

తొర్రూరుపై గులాబీ జెండా ఎగురవేస్తాం!
16 వార్డుల్లోనూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యం
ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి ఎర్ర‌బెల్లి దిశానిర్దేశం
గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు

కాకతీయ, తొర్రూరు : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు ముందే తొర్రూరులో రాజకీయ వేడి పెరిగింది. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దుబ్బతండ సమీపంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారం అండతో నిరుపేదలకు ఇవ్వకుండా కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను రాజకీయ కక్షతో నిలిపివేయడం సరికాదన్నారు.

అభివృద్ధికి కారకుడు కేసీఆర్

పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందంజలో ఉందంటే దానికి కారణం మాజీ సీఎం కేసీఆర్ అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. తొర్రూరు మండలాన్ని మున్సిపాలిటీగా మార్చి, అభివృద్ధికి బాటలు వేసిన మహానీయుడు కేసీఆర్‌ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలే బహిరంగంగా చర్చించుకుంటున్నారని, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

16 వార్డులపై గులాబీ పట్టు

తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 16 వార్డులనూ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గడపగడపకు పార్టీ బలోపేతం చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తొర్రూరు పట్టణ మాజీ ఎంపీటీసీ తూర్పాటి సుభద్ర–శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నమిళ్ళ విజయభాస్కర్, జాటోత్ వీరన్న, జాటోత్ వెంకన్నలు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని స్వచ్ఛందంగా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, పెద్దవంగర మండలాలకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే గులాబీ శిబిరంలో ఉత్సాహం వెల్లివిరుస్తోందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మలగుట్ట వెనుక మంటలు

కొమ్మలగుట్ట వెనుక మంటలు కాకతీయ, గీసుగొండ: మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి...

రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ

*రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ *బంగారు పతకం...

ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్

ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్ - విన్నుత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మర్రిపల్లి...

అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం

అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం *గీసుగొండ తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్.. కాకతీయ, గీసుగొండ:అన్ని...

బాధితుల్లో నమ్మకం పెంచాలి

బాధితుల్లో నమ్మకం పెంచాలి ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొందాలి సీపీ సీపీ సన్ ప్రీత్ సింగ్ ధర్మసాగర్...

పంటల సాగులో

పంటల సాగులో డ్రోన్లను వినియోగించుకోవాలి కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ డార్మెటరీ పనులు త్వరగా...

కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం

కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన చిన్న...

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కాకతీయ, ఖిలా వరంగల్: చింతల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img