epaper
Saturday, January 17, 2026
epaper

సీపీఐ శతాబ్ది సభకు సర్వం సిద్ధం

సీపీఐ శతాబ్ది సభకు సర్వం సిద్ధం
ఎరుపు మ‌యంగా మారిన ఖ‌మ్మం జిల్లా కేంద్రం
ఎస్ఆర్‌ అండ్‌ బీజీఎన్ఆర్‌ మైదానంలో బహిరంగ సభ
నేడు లక్షల మందిని స‌భ‌కు త‌ర‌లించేందుకు య‌త్నం
బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రుకానున్న జాతీయ నేత‌లు, వివిధ దేశాల ప్ర‌తినిధులు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. జనవరి 18న ఆదివారం ఖమ్మంలో లక్షలాది మందితో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక సభకు ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎస్ఆర్‌ అండ్‌ బీజీఎన్ఆర్‌ కళాశాల మైదానంలో జరగనున్న సభను జిల్లాలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ నిర్వహించని స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. 60 అడుగుల భారీ డిజిటల్ వేదికను సిద్ధం చేయగా, సుదూర ప్రాంతాల నుంచీ స్పష్టంగా కనిపించేలా సాంకేతిక సదుపాయాలు కల్పించారు. మైదానం అంతటా విద్యుత్ దీపాలు అమర్చారు. 40 వేల మందికి పైగా కూర్చునేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. జనసేవాదళ్ మహిళలు, కేంద్ర నాయకత్వానికి ముందు భాగంలో ప్రత్యేక స్థలాలు కేటాయించారు. ఖమ్మం నగరం మొత్తం ఎర్ర జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. ప్రదర్శనలకు వచ్చే వారికి దారి పొడవునా తాగునీటి సౌకర్యం కల్పించారు.

మూడు వైపుల నుంచి ప్రదర్శనలు

సిపిఐ శతాబ్ది సభ సందర్భంగా ఖమ్మంలో మూడు వైపుల నుంచి భారీ ప్రదర్శనలు రానున్నాయి. మొదటి ప్రదర్శన పెవిలియన్ మైదానం నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనసేవాదళ్ కార్యకర్తల కవాతు, కళాకారుల ప్రదర్శనలు, బంజారా–కోయ నృత్యాలు, డప్పు దళాలు, వృత్తి సంఘాల ప్రదర్శనలు ఉంటాయి. ఈ ప్రదర్శనకు బాగం హేమంతరావు నేతృత్వం వహిస్తారు. రెండో ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహం వద్ద నుంచి వైరా రోడ్డు మీదుగా సాగుతుంది. వాహనాల ద్వారా వచ్చిన ప్రజలు ఇందులో పాల్గొంటారు. ఈ ప్రదర్శనకు డి. రాజా, కూనంనేని సాంబశివరావు, ఎస్‌కే సాబీర్ పాషా, జమ్ముల జితేందర్రెడ్డి నేతృత్వం వహించనున్నారు. మూడో ప్రదర్శన ఖమ్మం నయాబజార్ కళాశాల నుంచి ప్రారంభమవుతుంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, పాలేరు నియోజకవర్గాలతో పాటు రైళ్ల ద్వారా వచ్చిన కార్యకర్తలు ఇందులో పాల్గొంటారు.

కేంద్ర నాయకత్వం హాజరు

బహిరంగ సభకు సిపిఐ కేంద్ర కౌన్సిల్, కార్యవర్గ, కార్యదర్శి వర్గ సభ్యులు హాజరుకానున్నారు. జాతీయ నాయకులు డి. రాజా, అమర్‌జిత్ కౌర్, బీకే టాంగో, రామకృష్ణ పాండా, అనిరాజా, గిరిశర్మ, కె. ప్రకాష్‌బాబు, సంతోష్‌కుమార్, సంజయ్‌కుమార్, పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ తదితరులు పాల్గొననున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రదర్శనలు ప్రారంభమై, మూడు గంటలకు సభా స్థలానికి చేరుకుంటాయి. ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెండింగ్ పనులు పూర్తి చేయండి..!

పెండింగ్ పనులు పూర్తి చేయండి..! రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అవసరం ప్రజలను ఒప్పించి...

లాటరీతో మహిళా రిజర్వేషన్ల ఖరారు

లాటరీతో మహిళా రిజర్వేషన్ల ఖరారు ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల కేటాయింపు ప్ర‌క్రియ పూర్తి రాజకీయ...

మున్సిపల్ “పోరు”కి సిద్ధం

మున్సిపల్ “పోరు”కి సిద్ధం కొత్త‌గూడెం కార్పోరేష‌న్‌కు తొలిపోరుకు రంగం సిద్ధం ఎస్టీ జ‌న‌ర‌ల్‌కు మేయర్...

విద్యార్థుల సమరశీల పోరాటాలు తీవ్రతరం చేయాలి

విద్యార్థుల సమరశీల పోరాటాలు తీవ్రతరం చేయాలి ఖమ్మంలో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు పీడీఎస్‌యూ రాష్ట్ర...

కమ్యూనిస్టుల ఐక్యత అత్య‌వ‌స‌రం

కమ్యూనిస్టుల ఐక్యత అత్య‌వ‌స‌రం పోరాట పంథాలో మార్పు అనివార్యం సంపద దోచుకునేవారే దేశభక్తులా? శతాబ్ది ఉత్సవాలు...

వురిమళ్ల సునందకు ‘అలిశెట్టి సాహిత్య అవార్డ్ ప్రదానం……

వురిమళ్ల సునందకు 'అలిశెట్టి సాహిత్య అవార్డ్ ప్రదానం...... పెద్దింటి అశోక్ కుమార్ చేతుల...

వందేళ్ల స్పూర్తితో పోరాటాలకు పదును!

వందేళ్ల స్పూర్తితో పోరాటాలకు పదును! శతాబ్ది ముగింపు సభకు ఖమ్మం గడ్డ సిద్ధం ఎర్రజెండాతోనే...

రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు.. ఎన్నిక‌లే త‌రువాయి..!

రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు.. ఎన్నిక‌లే త‌రువాయి..! ఖమ్మం కార్పోరేష‌న్‌, మునిసిపాలిటీల్లో రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు బీసీలకు పెరిగిన‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img