అవ్వల్ ధావత్’తో నెట్టింట రచ్చ
రాహుల్ సిప్లిగంజ్ మాసీ వాయిస్‌కు యూత్ ఫిదా
కాకతీయ, సినిమా : ‘నాటు నాటు’తో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్‌బేస్ సంపాదించిన టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన తాజా పాట నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అదే అవ్వల్ ధావత్. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న అమీర్ లోగ్ నుంచి విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రాన్ని అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మిస్తుండగా, రమణారెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే శ్రీవిష్ణు లాంచ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ వైరల్‌గా మారింది. రాహుల్ సిప్లిగంజ్ మాసీ వాయిస్‌కు తోడు ఆనీ మాస్టర్ మాస్ డ్యాన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫ్లోర్ దద్దరిల్లే ఎనర్జీతో సాగుతున్న ఈ సాంగ్‌ను మూవీ, మ్యూజిక్ లవర్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకు సంగీతం స్మరణ్ సాయి అందిస్తున్నారు. లీడ్ రోల్స్‌లో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ నటిస్తుండగా, వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూత్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ‘అమీర్ లోగ్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.


