యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ఆజ్ కీ రాత్’
ఏడాది దాటినా తగ్గని క్రేజ్
కాకతీయ, సినిమా : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే పాట మార్మోగుతోంది. విడుదలై ఏడాది దాటినా ట్రెండింగ్‌లో కొనసాగుతూ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తమన్నా నటించిన ఆజ్ కీ రాత్ సాంగ్ ఏకంగా 100 కోట్ల వ్యూస్ మార్కును అందుకుని అరుదైన మైలురాయిని చేరుకుంది. రిలీజ్ అయినప్పటి నుంచి ఈ పాటకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గకపోవడం విశేషం. ఈ పాట స్త్రీ 2 సినిమాకు అసలైన బూస్ట్‌గా మారింది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్–కామెడీ థ్రిల్లర్ 2024లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘స్త్రీ 2’ విజయానికి తమన్నా స్పెషల్ సాంగ్ కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. డ్యాన్స్, మ్యూజిక్, విజువల్స్ అన్నీ కలసి ‘ఆజ్ కీ రాత్’ను యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలబెట్టాయి.


