సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం
గౌడ సంఘం నేతలతో మర్యాదపూర్వక భేటీ
కొమ్మాలలో భూమి పూజకు పిలుపు
కాకతీయ, గీసుగొండ : తెలంగాణ గౌడ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం నాయకులు హైదరాబాదులో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర మాజీ చైర్మన్ *కత్తి వెంకట స్వామి గౌడ్*లను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం జాతర సందర్భంగా ఏర్పాటు చేయనున్న శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని వారికి ఆహ్వానం అందజేశారు. పాపన్న సేవలు, గౌడ సమాజ చరిత్రను యువతకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నేతలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్, రాష్ట్ర నాయకులు నాళం సంపత్ గౌడ్, చెంగల ఏకాంబరం గౌడ్, టైగర్ రమేష్, ధోమ్మటి రాజు గౌడ్, కక్కెర్ల శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


