epaper
Wednesday, March 4, 2026
epaper

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు?

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు?
నల్లబెల్లినే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు
కెనాల్ హద్దుల నిర్ణయంలో అధికారుల ఏకపక్ష ధోరణి
ఒక్క గ్రామానికే పరిమితమై మార్కింగ్ అన్యాయం
నోటీసులతో రైతులు, ప్రజల్లో భయాందోళనలు
బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది
న‌ల్ల‌బెల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి

కాకతీయ, నల్లబెల్లి : ఎస్సారెస్పీ డీబీఎం–38 కెనాల్ భూముల పరిరక్షణ విషయంలో ఇరిగేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గీసుకొండ నుంచి భూపాలపల్లి జిల్లా వరకు విస్తరించి ఉన్న కెనాల్‌కు సంబంధించి, అధికారులు కేవలం నల్లబెల్లి గ్రామానికే పరిమితమై హద్దుల మార్కింగ్ చేపట్టడం అన్యాయమని సారంగపాణి అన్నారు. కెనాల్ ప్రారంభం నుంచి చివరి వరకు రైట్, లెఫ్ట్ హద్దులను శాస్త్రీయంగా, సమగ్రంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ కోణం ఉందా?

పట్టా భూములు కలిగిన రైతులను, ఎన్నేళ్లుగా నివసిస్తున్న సామాన్య ప్రజలను నోటీసులతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లినే లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. కేవలం కొంతమందికే నోటీసులు జారీ చేయడంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలువ భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, పట్టాదారుల నుంచి భూములు కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. నిబంధనల పేరుతో ఒక్క ప్రాంతాన్నే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే బాధితుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు. సమావేశంలో కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ శ్రీనివాస్ గుప్తా, జన్నుజయరావు, గుండాల కుమారస్వామి, సర్పంచులు నాగెళ్ళి జ్యోతిప్రకాశ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, ఉపసర్పంచ్ గుమ్మడి వేణు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పన్నుల చెల్లింపుపై

పన్నుల చెల్లింపుపై వడ్డీ మాఫీ ఉండదు ప్రజలు కార్పొరేషన్‌కు సహకరించాలి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను...

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, మాజీ ఎమ్మెల్యే పెద్ది...

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు కాకతీయ, ఇనుగుర్తి: కెనాల్ నుంచి బేరు చెరువు...

ఘ‌నంగా హోలీ

ఘ‌నంగా హోలీ కాకతీయ, మరిపెడ: హోలీ వేడుక‌ల‌ను బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో...

ర్యాగింగ్ ఘటనపై

ర్యాగింగ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి కాకతీయ, మరిపెడ : మరిపెడ మండలంలోని...

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టరేట్‌లో...

డ్రెనేజీలోనే తాగునీటి పైపులు!

డ్రెనేజీలోనే తాగునీటి పైపులు! కాశీబుగ్గలో మురికికాల్వ నిర్మాణం అస్తవ్యస్తం పట్టించుకోని అధికారులు కాకతీయ, వరంగల్: వరంగల్...

కొమ్మాల బీఅర్ఎస్ ప్రభ బండ్ల సంద‌డి

కొమ్మాల బీఅర్ఎస్ ప్రభ బండ్ల సంద‌డి కాకతీయ, చెన్నారావుపేట: చెన్నారావుపేట మండలం నుండి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img