epaper
Saturday, January 17, 2026
epaper

పెండింగ్ పనులు పూర్తి చేయండి..!

పెండింగ్ పనులు పూర్తి చేయండి..!
రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అవసరం
ప్రజలను ఒప్పించి రోడ్డు విస్తరణ ప్ర‌క్రియ‌ పూర్తి చేయాలి
నాలుగు కాలాలు నిలిచేలా నాణ్యమైన పనులు
రాజకీయాలకతీతంగా అభివృద్ధి కొనసాగాలి
ఖమ్మం నగరాభివృద్ధిపై మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు
9వ డివిజన్‌లో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన

కాకతీయ, ఖమ్మం : పెండింగ్‌లో ఉన్న నగరాభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత–జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం నగర 9వ డివిజన్ రోటరీనగర్‌లో రూ.35 లక్షల వ్యయంతో 400 మీటర్ల మేర నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని కొత్తగా చూసినవారికి స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, ముఖ్యంగా పారిశుధ్యం గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను మిగిలిన నాలుగు నెలల్లో తప్పనిసరిగా పూర్తి చేయించుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అవసరం

నగరంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యేందుకు స్థానిక కార్పొరేటర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని మంత్రి తెలిపారు. విస్తరణ వల్ల నష్టపోయే పేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు, స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో టీడీఆర్ విధానాన్ని కూడా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రోడ్డు విస్తరణతో వ్యాపారాలు పెరుగుతాయని, ఆస్తుల విలువ కూడా అధికమవుతుందని పేర్కొన్నారు. సైడ్ డ్రైన్లపై ఫుట్‌పాత్‌లు పూర్తి చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలను ఒప్పించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. నగరంలో చేపట్టిన రోప్‌వే, వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. లకారం నిర్వహణలో లోపాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ రూ.35 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టామని, అవసరమైన ఇతర పనులకు కూడా మంజూరు లభించిందన్నారు. 9వ డివిజన్‌లో విద్యుత్ స్తంభాల తరలింపునకు ఎన్పిడిసిఎల్‌కు చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, మునిసిపల్ ఇంజనీర్లు, ఎన్పిడిసిఎల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీపీఐ శతాబ్ది సభకు సర్వం సిద్ధం

సీపీఐ శతాబ్ది సభకు సర్వం సిద్ధం ఎరుపు మ‌యంగా మారిన ఖ‌మ్మం జిల్లా...

లాటరీతో మహిళా రిజర్వేషన్ల ఖరారు

లాటరీతో మహిళా రిజర్వేషన్ల ఖరారు ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల కేటాయింపు ప్ర‌క్రియ పూర్తి రాజకీయ...

మున్సిపల్ “పోరు”కి సిద్ధం

మున్సిపల్ “పోరు”కి సిద్ధం కొత్త‌గూడెం కార్పోరేష‌న్‌కు తొలిపోరుకు రంగం సిద్ధం ఎస్టీ జ‌న‌ర‌ల్‌కు మేయర్...

విద్యార్థుల సమరశీల పోరాటాలు తీవ్రతరం చేయాలి

విద్యార్థుల సమరశీల పోరాటాలు తీవ్రతరం చేయాలి ఖమ్మంలో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు పీడీఎస్‌యూ రాష్ట్ర...

కమ్యూనిస్టుల ఐక్యత అత్య‌వ‌స‌రం

కమ్యూనిస్టుల ఐక్యత అత్య‌వ‌స‌రం పోరాట పంథాలో మార్పు అనివార్యం సంపద దోచుకునేవారే దేశభక్తులా? శతాబ్ది ఉత్సవాలు...

వురిమళ్ల సునందకు ‘అలిశెట్టి సాహిత్య అవార్డ్ ప్రదానం……

వురిమళ్ల సునందకు 'అలిశెట్టి సాహిత్య అవార్డ్ ప్రదానం...... పెద్దింటి అశోక్ కుమార్ చేతుల...

వందేళ్ల స్పూర్తితో పోరాటాలకు పదును!

వందేళ్ల స్పూర్తితో పోరాటాలకు పదును! శతాబ్ది ముగింపు సభకు ఖమ్మం గడ్డ సిద్ధం ఎర్రజెండాతోనే...

రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు.. ఎన్నిక‌లే త‌రువాయి..!

రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు.. ఎన్నిక‌లే త‌రువాయి..! ఖమ్మం కార్పోరేష‌న్‌, మునిసిపాలిటీల్లో రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు బీసీలకు పెరిగిన‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img