కూడా భూముల అభివృద్ధిపై ఫోకస్
కూడ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
కాకతీయ, హనుమకొండ : వరంగల్ కూడ చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శనివారం వరంగల్ కూడకు సంబంధించిన భూములు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, కూడ వైస్ చైర్మన్ *చాహత్ బాజ్ పై*తో కలిసి పర్యటించారు. పైడిపల్లి గ్రామంలో ఉన్న వరంగల్ కూడ భూమిని సందర్శించిన ఆయన, భూమి అభివృద్ధి జరిగితే చుట్టుపక్కల రైతుల భూములకు, గ్రామ ప్రజలకు ప్రాధాన్యం పెరుగుతుందని తెలిపారు. అనంతరం కొత్తపేట గ్రామ దారి నుంచి వెళ్లే ఇన్నర్ రింగ్ రోడ్డులోని సర్కిల్ పాయింట్‌ను పరిశీలించారు. అలాగే వరంగల్ బస్టాండ్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, వాటిని నిర్ణీత గడువులో, నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూడ అధికారులు సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్రావు, ఏపీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


