ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న నన్నపునేని దంపతులు
కాకతీయ, వర్ధన్నపేట : ఐనవోలు గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్–మెహర్ వాణి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామికి ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు నన్నపునేని దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి కృప కలకాలం ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నన్నపునేని దంపతుల దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.


