epaper
Friday, January 16, 2026
epaper

గగనతలంలో రంగుల పండుగ

గగనతలంలో రంగుల పండుగ
గోల్కొండ కోట‌లో అట్టహాసంగా ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
గగనయాత్ర చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
గంటన్నర పాటు 13 కిలోమీటర్ల సాహస విహారం
పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం : మంత్రి జూప‌ల్లి
‘డెస్టినేషన్ తెలంగాణ’ బ్రాండ్ బలోపేతానికి అడుగు

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : చారిత్రక గోల్కొండ కోట పరిసరాల్లో శుక్రవారం గగనతలం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. గోల్ఫ్ క్లబ్ వేదికగా నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి జూపల్లి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించి అందరి దృష్టిని ఆకర్షించారు. గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ఆకాశంలోకి ఎగసిన బెలూన్, సుమారు గంటన్నర పాటు 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అప్పోజీగూడ శివారులో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ గగన విహారం తనకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని మంత్రి తెలిపారు.

పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, తెలంగాణ పర్యాటక రంగంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది అని అన్నారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదికగా నిలుస్తోందని చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఒకవైపు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటుతుండగా, మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్స్ ద్వారా ఆధునిక సాంకేతికత, భవిష్యత్ దృక్పథాన్ని పరిచయం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని సహజ సౌందర్యం, చారిత్రక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ‘డెస్టినేషన్ తెలంగాణ’ బ్రాండ్‌ను బలోపేతం చేస్తూ, దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇలాంటి సాహసోపేత కార్యక్రమాలు కీలకంగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటకులు కేవలం సందర్శించడమే కాకుండా, ఒక విశేషమైన అనుభూతిని పొందేలా వినూత్న ఈవెంట్లను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ఉపాధి అవకాశాలకూ దోహదం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానంతో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తూ భాగస్వామ్య విధానంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నాణ్యమైన సేవలను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరగనున్నాయని చెప్పారు. “ఇది ఒక అద్భుత అనుభూతి. సంప్రదాయానికి గౌరవం ఇస్తూ, సాంకేతికతకు స్వాగతం పలుకుతూ తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం. నేడు ఆకాశంలో ఎగురుతున్న ఈ బెలూన్లు… తెలంగాణ పర్యాటక రంగం ప్రపంచ స్థాయి ఎత్తులకు చేరుకోబోతోందనే సంకేతం” అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. ఈ ఫెస్టివల్ కుటుంబాలు, యువత, పిల్లలందరికీ మధుర జ్ఞాపకంగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, పర్యాటక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

జాగృతిలో అధ్యయన కమిటీ ఏర్పాటు!

జాగృతిలో అధ్యయన కమిటీ ఏర్పాటు! ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి కమిటీ సభ్యుడిగా...

ఆహార కల్తీపై ఉక్కుపాదం!

ఆహార కల్తీపై ఉక్కుపాదం! ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు కల్తీని హత్యాయత్నంగా పరిగణిస్తాం ప్రత్యేక బృందాలు,...

ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం!

ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం! బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేత కాంగ్రెస్...

క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్!

క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్! డయల్–100కు సమాచారం.. వెంటనే రంగంలోకి...

గంద‌ర‌గోళంగా మునిసిప‌ల్ ఓట‌ర్ల జాబితా

గంద‌ర‌గోళంగా మునిసిప‌ల్ ఓట‌ర్ల జాబితా వేరే నియోజకవర్గాల ఓటర్లు మున్సిపాలిటీల్లో నమోదు పూర్తిస్థాయి ఎంక్వైరీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img