వురిమళ్ల సునందకు ‘అలిశెట్టి సాహిత్య అవార్డ్ ప్రదానం……
పెద్దింటి అశోక్ కుమార్ చేతుల మీదుగా
ఆంతర్యం కథా సంపుటి ఆవిష్కరణ…..
కాకతీయ,ఖమ్మం : అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్థంతి సందర్భంగా జగిత్యాలలోని కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం అధినేత గుండేటి రాజు “అలిశెట్టి సాహిత్య అవార్డును ప్రముఖ కవయిత్రి, పాఠ్య పుస్తక రచయిత, కీర్తి పురస్కార గ్రహీత వురిమళ్ల సునంద కు ప్రదానం చేశారు. సాహిత్యంలో ఆమె చేస్తున్న విశేష సేవలకు గాను ఈ అవార్డ్ దక్కినట్లు పలువురు సాహితీవేత్తలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కథా రచయితలు పెద్దింటి అశోక్ కుమార్, కె.వి.నరేందర్ చేతుల మీదుగా సునంద రాసిన ఆంతర్యం కథా సంపుటి ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ వేత్తలు, అభిమానులు పాల్గొన్నారు.


