నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం
దేవుని గుట్టపై భక్తుల సందడి
కాకతీయ, నెల్లికుదురు : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లికుదురు మండలంలోని నైనాల గ్రామంలో దేవుని గుట్టపై స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల మంత్రోచ్చారణలు, వేద మంత్రాల నడుమ కల్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని కొండపల్లి ప్రకాష్‌రావు–భారతీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించగా, వేదపండితులు కళ్లకుంట్ల శ్రీనివాసాచార్యులు, నిఖిల్ కృష్ణమాచార్యులు పర్యవేక్షించారు. కల్యాణ కర్తలుగా మామిండ్లపల్లి నర్సింహాచారి–శోభ దంపతులు, గ్రామ సర్పంచ్ యాసం సంధ్య–రమేష్ దంపతులు వ్యవహరించారు.
క్రీడోత్సవాలతో గ్రామానికి పండుగ వాతావరణం
ఈ సందర్భంగా గ్రామంలో సూపర్ టైగర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడోత్సవాలను, అంబేద్కర్ యువజన సంఘం నిర్వహించిన షటిల్ పోటీలను గ్రామ సర్పంచ్ యాసం సంధ్య–రమేష్ ప్రారంభించారు. క్రీడా కార్యక్రమాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాల్లో ఉప సర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్, వార్డు సభ్యులు ఆకుల యాకయ్య, గిరిశెట్టి అరుణ–రమేష్, శివార్ల ఏలేంద్ర–కొమురయ్య, యాసం వెంకటేశ్వర్లు, బొడ్డు విజయ్ కుమార్, ఆకుల వెంకటేష్, ఆకుల జ్యోతి–మల్లేష్, ఏర్పుల శృతి–సరేష్, నారబోయిన రమ–గుట్టయ్యలతో పాటు గ్రామస్తులు, మహిళలు, యువకులు, క్రీడా నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల హాజరుతో, సంప్రదాయబద్ధంగా జరిగిన వెంకటేశ్వర స్వామి కల్యాణం నైనాల గ్రామానికి ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను చేకూర్చింది.


