epaper
Friday, January 16, 2026
epaper

మారిన ప్రాధాన్యాలు..మార‌నున్న రాజ‌కీయం

మారిన ప్రాధాన్యాలు..మార‌నున్న రాజ‌కీయం
2020తో పోలిస్తే 2026లో రిజర్వేషన్ల కేటాయింపుల్లో మార్పు
కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో కొత్త సమీకరణాలు
బీసీలకు పెరిగిన ప్రాధాన్యం.. పెర‌గ‌నున్న‌ ప్రాతినిధ్యం
మహిళా రిజర్వేషన్‌తో ‘డమ్మీ’ రాజకీయంపై మళ్లీ చర్చ

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ముందే విడుదలైన తాజా రిజర్వేషన్ నోటిఫికేషన్ స్థానిక రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. 2020 ఎన్నికల సమయంలో అమలులో ఉన్న రిజర్వేషన్లతో పోలిస్తే 2026 నాటికి చోటుచేసుకున్న మార్పులు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ఎవరికీ లాభం కలిగింది? ఎవరి ఆశలపై నీళ్లు చల్లాయి? అన్న అంశంపై అన్ని పార్టీల్లో తీవ్ర చర్చ సాగుతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో డివిజన్‌ల వారీగా మారిన రిజర్వేషన్లు ఇప్పటికే ఉన్న నేతల రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారాయి. గత ఎన్నికల్లో పట్టు సాధించిన కొందరు నేతలు ఈసారి రేస్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడగా, కొత్త వర్గాలకు అవకాశం వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కార్పొరేషన్‌లో పెర‌గ‌నున్న బీసీ ప్రాతినిధ్యం

కరీంనగర్ నగరపాలక సంస్థలో తాజా రిజర్వేషన్ నోటిఫికేషన్ రాజకీయ లెక్కలను పూర్తిగా మార్చింది. 2020లో మొత్తం 60 వార్డుల్లో ఎస్టీకి 1, ఎస్సీకి 3, ఎస్సీ మహిళలకు 3 కలిపి మొత్తం 6 సీట్లు ఉండగా, బీసీలకు 23 వార్డులు కేటాయించారు. జనరల్ మహిళలకు 16, అన్‌రిజర్వ్‌డ్‌కు 14 సీట్లు ఉండటంతో మహిళా రిజర్వేషన్ మొత్తం 30కి చేరింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం కార్పొరేషన్‌లో వార్డుల సంఖ్య 66కు పెరిగింది. ఇందులో బీసీలకు 25 సీట్లు కేటాయించడంతో ఈ వర్గానికి మరింత రాజకీయ బలం చేకూరింది. ఎస్సీలకు మొత్తం 7 సీట్లు దక్కగా, ఎస్టీలకు మాత్రం మళ్లీ ఒక్క వార్డే కొనసాగింది. జనరల్ మహిళలకు 18, అన్‌రిజర్వ్‌డ్‌కు 15 సీట్లు ఉన్నాయి. 2020తో పోలిస్తే బీసీలకు స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుండగా, ఎస్సీలకు స్వల్ప లాభమే దక్కిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మున్సిపాలిటీల్లోనూ అదే సరళి

కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్ తరహా పరిస్థితులే కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను బీసీలకు 8, ఎస్సీలకు 6, ఎస్టీలకు ఒక్క వార్డు మాత్రమే కేటాయించారు. జమ్మికుంటలోనూ బీసీలకే ఆధిక్యం కొనసాగుతోంది. చొప్పదండి మున్సిపాలిటీలో 14 వార్డుల్లో బీసీలకు 3, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 సీటే లభించింది. మొత్తంగా చూస్తే మూడు మున్సిపాలిటీల్లోనూ బీసీలకే ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా, ఎస్టీలు ప్రతీకాత్మక స్థాయికే పరిమితమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీలు మాత్రం మధ్యస్థ స్థాయిలోనే నిలిచిపోయారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

రిజర్వేషన్ల పెంపుతో మ‌హిళ‌ల‌కు ప్ల‌స్‌..!

మహిళా రిజర్వేషన్ సంఖ్య పెరిగినప్పటికీ, ఆ సీట్లలో డమ్మీ అభ్యర్థుల రాజకీయానికి మళ్లీ అవకాశం ఉందన్న చర్చ తెరపైకి వచ్చింది. కాగితాలపై మహిళలకు అధిక ప్రాతినిధ్యం కనిపిస్తున్నా, వాస్తవంగా రాజకీయ నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అంశం టికెట్ల పంపకంలో పార్టీలకు పెద్ద సవాలుగా మారనుంది. రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల సంఖ్య పెరిగింది. ఒకే డివిజన్‌పై పలువురు పోటీ పడుతుండటంతో పార్టీల అధిష్టానాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని డివిజన్లలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. మొత్తంగా 2026 మున్సిపల్ ఎన్నికల్లో వ్యక్తుల కంటే రిజర్వేషన్ పటమే కీలకంగా మారిందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. సామాజిక న్యాయం లక్ష్యమా? లేక రాజకీయ గణితమే ప్రధానమా? అన్న ప్రశ్నలతో కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకూ మరింత వేడెక్కుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మినీ థియేటర్లలో రోడ్డు భద్రత సందేశం

మినీ థియేటర్లలో రోడ్డు భద్రత సందేశం సినిమాల మధ్యే ట్రాఫిక్ అవగాహన హెల్మెట్, సీట్‌బెల్ట్‌పై...

మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్

మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్ ▪️ అడ్మిషన్ పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్...

శిశుమందిర్ అభివృద్ధికి రూ.1.16 లక్షల విరాళం

శిశుమందిర్ అభివృద్ధికి రూ.1.16 లక్షల విరాళం ఆచార్యుడిగా పనిచేసిన నాయిని చంద్రయ్య ఉదార‌త‌ కాకతీయ,...

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img