2027 సమ్మర్‌కు ‘స్పిరిట్’ ఫిక్స్
కాకతీయ, సినిమా : ప్రభాస్–సందీప్ రెడ్డి వంగా కాంబోపై అంచనాలు మరింత పెరిగాయి. మెగా స్టార్‌డమ్‌తో వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు ఇటీవల ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శరీరంపై గాయాల ముద్రలు, షర్ట్ లేకుండా చేతిలో మద్యం బాటిల్, సిగరెట్‌తో ప్రభాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ యూనిట్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ యాక్షన్ డ్రామా 2027 మార్చి 5న థియేటర్లలోకి రానుంది. పండగ వాతావరణంలో విడుదల కానున్న ఈ సినిమాతో వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.


