బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న‘మనశంకర వరప్రసాద్ గారు’
సంక్రాంతి కానుకగా విడుదలై సెన్సేషనల్ రన్
వరల్డ్‌వైడ్‌గా రూ.200 కోట్ల మార్క్ దాటిన చిత్రం
కాకతీయ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘మనశంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రాబడుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి తనదైన శైలిలో అద్భుతమైన నటనతో అభిమానులకు పండుగ విందు అందించారు. సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.200 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘన విజయానికి కారణమైన ప్రేక్షకులు, అభిమానులకు మేకర్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్ కీలకమైన కామియో పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్నిచ్చింది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో మెగాస్టార్ సత్తాను మరోసారి నిరూపించింది.


