epaper
Tuesday, March 3, 2026
epaper

18న పాలేరుకు సీఎం రేవంత్‌

18న పాలేరుకు సీఎం రేవంత్‌
▪️ రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
▪️ మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు శ్రీకారం
▪️ జేఎన్‌టీయూ, నర్సింగ్ కళాశాలలతో విద్యకు ఊపిరి
▪️ కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన
▪️ మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం
▪️ హైదరాబాద్ వెలుపల తొలిసారి మేడారంలో క్యాబినెట్ భేటీ
రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

కాకతీయ, కూసుమంచి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా రూ.362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. మద్దులపల్లిలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు సీఎం శ్రీకారం చుడతారని వెల్లడించారు. రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌ను సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కూసుమంచి మండలంలో రూ.వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. ఇదే వేదికగా రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారని చెప్పారు.

హైదరాబాద్ వెలుపల తొలిసారి క్యాబినెట్ భేటీ

రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారని తెలిపారు. ఇది చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. సమ్మక్క–సారలమ్మ మహాజాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని మంత్రి చెప్పారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ప్రతిబింబించేలా నిర్మించిన రాతి కట్టడాలను ఈ నెల 19న ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. గత ప్రభుత్వాల్లా ఎన్నికల వేళ బొమ్మలు చూపడం తమ అలవాటు కాదని, ప్రజల మధ్య ఉండి నిరంతరం పనిచేసే ప్రభుత్వమిదని స్పష్టం చేశారు. అలాగే గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అభివృద్ధికి మారుపేరు తుమ్మల

అభివృద్ధికి మారుపేరు తుమ్మల ప్రతిపక్షాలు తుమ్మల ప్రతిష్ఠపై బురదజల్లే ప్రయత్నం ప్రజలు కర్రుకాల్చి వాత...

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు కాకతీయ, కొత్తగూడెం రూరల్: రాహుల్...

విశిష్ట సేవలు చిరస్మరణీయం

విశిష్ట సేవలు చిరస్మరణీయం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్‌గా...

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ...

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాలు కలెక్టరేట్‌లో ప్రజల అర్జీల స్వీకరణ కాకతీయ,...

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి ఎస్పీ రోహిత్ రాజ్‌ కాకతీయ, కొత్తగూడెం రూరల్: హోళీ...

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు ముందస్తుగా రంగుల పండుగ వేడుకలు సహజ రంగులతో చిన్నారుల...

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన

ఇండ్ల మధ్య సెల్ టవర్లు... ప్రజల్లో ఆందోళన రేడియేషన్ భయం... అనుమతులపై అనుమానాలు సాయినగర్‌లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img