మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు
మేడారం నుంచి జాకారం వరకు ట్రాఫిక్ జాం
గట్టమ్మ దగ్గర భక్తుల అష్ట కష్టాలు
సెలవులు కావడంతో లక్షలాదిగా తరలివస్తున్న జనాలు
జోరందుకున్న ముందస్తు మొక్కులు
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం జాతరకు భక్తులు శుక్రవారం భారీగా తరలివస్తున్నారు. సెలవులు కావడంతో లక్షలాదిగా భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. మేడారం నుంచి ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న జాకారం వరకు వాహనాల రాకపోకలతో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. రహదారులపై వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గట్టమ్మ వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దర్శనాల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా ముందస్తు మొక్కులు జోరందుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లిస్తూ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.



