సీపీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరోసారి మావోయిస్టుల లొంగుబాటు జరిగింది. సెంట్రల్ కమిటీకి చెందిన ఇద్దరు ముఖ్యమైన మావోయిస్టు సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట లొంగుబాటు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వారి లొంగుబాటుతో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. భద్రతా దళాల కఠిన చర్యలు, ప్రభుత్వ పునరావాస పథకాల ప్రభావంతోనే లొంగుబాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ క్యాంప్ ఆఫీసులో సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించి లొంగుబాటు వివరాలు వెల్లడించనున్నారు. లొంగిపోయిన వారి వివరాలు, వారు గతంలో చేపట్టిన కార్యకలాపాలు, పునరావాస చర్యలపై పోలీస్ కమిషనర్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.


