యువకులు క్రీడలపై మక్కువ చూపాలి
—- ఎస్సై కరుణాకర్
కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై మక్కువ చూపాలని వాటితోటే దేహదారుఢ్యం మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎస్సై గంగారపు కరుణాకర్ అన్నారు. బుధవారం ఇనుగుర్తి మండలం లోని మీట్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని మర్రికుంట తండాలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని సేవాలాల్ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలకు ఎస్సై ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు వ్యసనాలకు బానిస కాకుండా విద్య క్రీడలపై మక్కువ చూపాలని అన్నారు. అనంతరం ఎస్సైని యువకులు ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ భూక్యా రాములు,మాజీ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ రవినాయక్, భూక్యా ప్రభాకర్, రాజు, శ్రీను, రమేష్, బిక్షపతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


