స్వచ్ఛ బ్రాహ్మణ కొత్తపల్లి నిర్మాణమే లక్ష్యం
సర్పంచ్ డా. చిర్ర యాకాంతం గౌడ్
కాకతీయ నెల్లికుదురు : స్వచ్ఛ బ్రాహ్మణ కొత్తపల్లి నిర్మాణంలో బాగంగా గ్రామాన్ని అన్నిరంగాలలో ముందుకు తీసుకొని వెళ్తామని సర్పంచ్ డా “చిర్ర యాకాంతం గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామాన్నిఅన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా ఎన్నికల్లో అఖండ విజయం కట్టబెట్టినగ్రామ ప్రజలకు సాధ్యమైనంత వరకు సేవ చేస్తానని నెలరోజుల కాలంలోనే నల్లాల మరమ్మత్తు తో పాటు పైపులైను లీకేజీలు సరిచేశామని సైడ్ కాల్వల్లో పూడిక తీత పనులు జరిగాయాన్నారు ప్రస్తుతం గ్రామాన్ని స్వచ్ఛమైన గ్రామంగా చేయడంలో నిమగ్న మయ్యామని గ్రామస్తులందరి సహకారం తో యువత, మహిళలు పెద్దఎత్తున పాల్గొని అంతర్గత రోడ్ల పక్కన కంపలు, గడ్డి, మట్టిని తొలగించడం జరుగుతుందని, రానున్న 5 సంవత్సరాల్లో గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో నిలుపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్టీ అధ్యక్షలు బొల్లు మురళి, వార్డు సభ్యులు జెల్ల పర్శరాములు, బొమ్మేనబోయిన స్వరూప వీరన్న, పిడుగు అనంత యాదగిరి గ్రామస్తులు యువత పాల్గొన్నారు.


