మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..
కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని యాదవ్ నగర్ క్రాస్ రోడ్డులో ఉన్న తోట కన్వెన్షన్‌లో బాలాజీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రవికుమార్ హాజరయ్యారు. అలాగే సంఘ కార్యదర్శి పేరుకారి శ్రీధర్, మాందాటి మహేందర్, కోశాధికారి పూజారి సత్యనారాయణ, తోట నవీన్ కుమార్, మాడిశెట్టి వరుణ్ భక్క రాజ్ కుమార్, బాలాజీ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు మీరు పెళ్లి రాజ్ కుమార్, కోసనం రమేష్ బాబు, లక్కం నాగరాజు, ఆకుల వీరస్వామి, తోట వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. నూతన సంవత్సర క్యాలెండర్ ద్వారా సంఘ కార్యక్రమాలు, సామాజిక సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని తెలిపారు. సంఘ ఐక్యతను బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.


