పోక్సో కేసు నిందితుడికి ఏడాది జైలు శిక్ష
కాకతీయ, బయ్యారం : మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కొట్టె చెన్నయ్యపై ఫిబ్రవరి1న బయ్యారం పోలీస్ స్టేషన్ లో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కె. తిరుపతి కేసు నమోదు చేశారు. కోర్ట్ ట్రయల్ లో సాక్ష్యధారాలను కోర్ట్ లో ప్రవేశపెట్టగా డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ జడ్జి ఎమ్డి అబ్దుల్ రఫీ బుధవారం తీర్పు వెలువరించినట్లు ఎస్సై తెలిపారు. ఒక సంవత్సరం జైలు శిక్ష , 600 రూపాయల జరిమానా విధించినారు. కేసు నమోదు ఇన్వెస్టిగేషన్ చేసిన బయ్యారం ఎస్ఐ తిరుపతిని, కోర్ట్ కానిస్టేబుల్ రాజు ను, కోర్ట్ లైసన్ ఆఫీసర్ జీనత్, పి.పి వెంకటయ్య, గణేష్, ఆనంద్ ను ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకాన్ అభినందించారు.
పోక్సో కేసు నిందితుడికి ఏడాది జైలు శిక్ష
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


