- సీఎం కప్ క్రీడలకు టార్చ్ లేకుండా టార్చ్ ర్యాలీ నిర్వహించిన అధికారులు
కాకతీయ, దుగ్గొండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల ఆరంభం అధికారాగనం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్న తీరు మండల ప్రజలను నివ్వేరపోయేలా చేస్తుంది. రెండవ విడత సీఎం కప్ క్రీడల నిర్వహణ షెడ్యూల్ లో భాగంగా దుగ్గొండి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన టార్చ్ ర్యాలీని టార్చ్ లేకుండా తూతూ మంత్రంగా నిర్వహించారు. కేవలం మండల అధికారులు, పంచాయితీ కార్యదర్శులు తప్ప మిగతా వారెవరు ర్యాలీలో పాల్గొనకపోవడం గమనార్హం…
ఆరంభమే ఇలా… నిర్వహణ ఎలా…
ఆరంభంలోనే అంటి ముట్టనట్టుగా వ్యవహారిస్తున్న అధికారుల తీరుపై సీఎం కప్ క్రీడల నిర్వహణ ఎలా సాధ్యం అవుతుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. సీఎం కప్ జ్యోతి ప్రదర్శన ర్యాలీ, క్రీడల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిన ఏర్పాట్ల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారఘనంతో నిర్వహించిన ర్యాలీలో మండల పంచాయితీ అధికారి శ్రీధర్ గౌడ్, విద్యావనరుల అధికారి వెంకటేశ్వర్లు, ఎస్సై రావుల రణధీర్, సూపరిండెంట్ రవికుమార్ మరియు వివిధ గ్రామ పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
డివిజన్ మొత్తానికి ఒకే టార్చ్….
మండల పంచాయితీ అధికారి శ్రీధర్ గౌడ్ జ్యోతి (కాగడా) ప్రదర్శన ర్యాలీని టార్చ్ లేకుండా చేయడం ఏంటని మండల పంచాయితీ అధికారి శ్రీధర్ గౌడ్ ను వివరణ కోరగా నర్సంపేట డివిజన్ మొత్తానికి ఒకే టార్చ్ ను ఏర్పాటు చేశారని అందువలన టార్చ్ లేకుండానే ర్యాలీని కొనసాగించామని తెలిపారు.


