దేశ భవిష్యతు నిర్మాణంలో యువత కీలక పాత్ర
స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో
యూత్ ఫర్ స్వచ్ఛ దుగ్గొండి వ్యవస్థాపకులు శానబోయిన రాజ్ కుమార్
కాకతీయ, దుగ్గొండి: యువత దేశభవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని స్వామి వివేకానంద సూక్తులు గుర్తు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరు యువత భాగస్వామ్యం కావాలని యూత్ ఫర్ స్వచ్ఛ్ దుగ్గొండి వ్యవస్థాపక అధ్యక్షులు శానబోయిన రాజ్ కుమార్ యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 163 వ జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్బంగామండల కేంద్రంలో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి యువతకు మార్గానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ లేవండి, మేల్కోండి, గమ్యం చేరేవరకు ఆగకండి మాటలు యువతకు శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదానం చేస్తాయన్నారు. కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోకల నర్సింహా రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ యాదగిరి సుధాకర్, వార్డ్ సభ్యులు కక్కెర్ల ప్రమోద్, ముప్పారపు అశోక్, శెంకశి సంపత్, కందికొండ రాజు, చల్ల కిషన్, గొర్కటి రాజ్ కుమార్ యువకులు తదితరులు పాల్గొన్నారు.


