ప్రజా సమస్యల పరిష్కారంలో కాకతీయ ముందంజ..
కాకతీయ దినపత్రిక ప్రజాస్వామ్యానికి బలం
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
కాకతీయ,రాయపర్తి: కాకతీయ దినపత్రిక సామాన్యుడి గొంతుకగా మారి,ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రశంసించారు.సోమవారం రాయపర్తి మండల కేంద్రంలో రైతు వేదిక ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక 2026 సంవత్సర క్యాలెండర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను వెలికి తీసి అధికారుల్లో చలనం పుట్టించి సమస్యల పరిష్కారానికి కాకతీయ ఎంతో కృషి చేస్తుందని అన్నారు.అనతి కాలంలోనే ఈ పత్రిక పాఠకుల మన్ననలు పొందడం అభినందనీయమని ఆమె కొనియాడారు.ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.యువ జర్నలిస్టులు పరిశోధనాత్మక జర్నలిజం వైపు అడుగులు వేయాలని,పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో మీడియా భాగస్వామ్యం అవసరమని ఆమె పేర్కొన్నారు.కాకతీయ దినపత్రిక పాఠకులకు,యాజమాన్యానికి,జర్నలిస్టులకు ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి,బ్లాక్ అధ్యక్షుడు హమ్యా నాయక్,మాజీ టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి, సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు


